Old Useful G.Os

Notifications

Results

Sunday 8 May 2016

CPS - available Benefits

పదవీ విరమణ పొందేరోజు ఎంత చెల్లిస్తారు? పెన్షన్ ఎలా చెల్లిస్తారుఏఎ రకమైన పెన్షన్ చెల్లిస్తారు

జి. యం.ఎస్ నం. 62 తేది 07.03.2014 ప్రకారం ఖాతాదారుడు స్వచ్చంద పదవీ విరమణ, పదవీ విరమణ, అకాల మరణం మూడు సందర్భాలలో ఖాతా నుండి డబ్బును తిరిగి పొందగలరు


1. స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో : ఉద్యోగి స్వచ్చంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 80% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అంద చేస్తారు. 20% నిదిని చెల్లిస్తారు. మొత్తం నిది 1 లక్ష లోపు ఉంటే  మొత్తాన్ని చెల్లిస్తారు


2. సాదారణ పదవీ విరమణ సందర్భంలో : ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 40% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అంద చేస్తారు. 60% నిదిని చెల్లిస్తారు. మొత్తం నిది 2 లక్షల లోపు ఉంటే  మొత్తాన్ని చెల్లిస్తారు.
3. అకాల మరణం పొందిన సందర్భంలో : ఉద్యోగి ఖాతా లో ఉన్న మొత్తం (100%) ను నామినికి(లకు) చెల్లిస్తారు.  
* నిర్ణిత శాతంలలో చేతికి ఇచ్చే సొమ్ముకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు లేకపోవడం  ఇబ్బందికరం. 
* PFRDA సర్కులర్ PFRDA/2015/27/EXIT/2 తేది 12. 11.2015 ప్రకారం తేది 01.04.2016 నుండి CPS అమౌంట్ ని విత్ డ్రా చేయడం కోసం అప్లై చేయడం కేవలం (except death cases) ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి
ప్రస్తుతానికి నెలవారిగా పెన్షన్ చెల్లించడానికి Annuity Service Providers గా నియామాకం చేశారు అవి 
1         1.    Life Insurance Corporation of India          2. HDFC Life Insurance Co. Ltd
3.  ICICI Prudential Life Insurance Co. Ltd    4. SBI Life Insurance Co Ltd
5.  Star Union Dai-ichi Life Ins. Co. Ltd

డిఫాల్ట్ Annuity ప్రొవైడర్ గా SBI ని తీసుంటున్నారు.

పెన్షన్ చెల్లించడానికి నియామకం చేసిన ఐదు అన్యుటి సర్వీస్ ప్రొవైడర్స్ లో ప్రభుత్వ రంగ సంస్థలయిన SBI మరియు LIC లను పరిశీలనకు తీసుకునగా SBI వారు 15 రకాల పెన్షన్ లను LIC వారు 10 రకాల పెన్షన్ లను వివిధ వయసుల వారిగా అందిస్తున్నారు, మనం పెట్టే పెట్టుబడికి 1లక్ష రూపాయలకు నెలవారిగా ఆయా వయసువారికి  పెన్షన్ గా చెల్లించే మొత్తము తేది 03.03.2016 నాటి విలువలు క్రింది టేబుల్ లో ఉన్నాయి.

CPS ఉద్యోగి పదవీ విరమణ/ అకాల మరణం చెందిన   సందర్బం లో ఎలాంటి  ప్రయోజనాలు పొందుతారు :



          పైన చెప్పిన టేబుల్ లో ఎంచుకున్న పెన్షన్ చెల్లిస్తారు, సాదారణ పదవీ విరమణ అయిన సంధర్బంలో 60% CPS నిధిని, స్వచ్చంద పదవీ విరమణ అయిన సందర్బంలో 20% CPS నిధిని చెల్లిస్తారు. గ్రాట్యూటి ని ప్రస్తుతం చేల్లించడం లేదు, గ్రాట్యూటి అనేది ఉద్యోగులకు వాళ్ళు చేసిన సేవలకు భాహుమానంగా ఇచ్చేది దీనిని ప్రైవేట్ సెక్టార్ లో కూడా చెల్లిస్తున్నారు కాని CPS ఉద్యోగులకు గ్రాట్యూటి సదుపాయం లేకపోవడం గర్హనీయం దీనికోసం మన PRTU-TS రాష్ఠ్ర శాఖ ప్రాతినిద్యం చేసినదిఉద్యోగి అకాల మరణం చెందిన  సందర్బంలో వారి ఖాతా లో జమ అయిన మొత్తం నిధిని చెల్లిస్తారు కాని కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన పామిలీ పెన్షన్ చేల్లించడం లేదు. మిగితా బెనిఫిట్స్ పాత పెన్షన్ విధానం లో లాగే ఖాతా లో జమ ఉన్న EL/HPL ఎన్కాష్మేంట్, GIS కింద జమచేసిన అమౌంట్ కాని ఆకాల మరణం పొదిన సందర్భంలో GIS కింద జమచేసిన అమౌంట్ తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ను APGLI అమౌంట్ ను మొ|| చెల్లిస్తారు.


More information Annuity Service Providers - Click here

0 comments:

Post a Comment