ఆదాయపన్ను
(ఆర్ధిక సంవత్సరం
2025-26) లెక్కించే విధానం - సమీక్ష
ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం తేదీ 01.04.2025 నుండి తేదీ 31.03.2026 వరకు వర్తించే విధంగా ఆదాయపన్ను చట్టము, 1961 2025-26 ఆర్ధిక సంవత్సరం నకు ఉద్యోగుల జీతాదాయమునకు సంబంధించి జరిగిన మార్పులు అందుబాటులోకి వచ్చిన అంశాలను పరిశీలిద్దాం. ఆదాయపు శ్లాబులను న్యూ రెజిమ్ మరియు ఓల్డ్ రెజిమ్ నందు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
|
శ్లాబ్ కేటగిరీ |
న్యూ రెజిమ్ |
శ్లాబ్ కేటగిరీ |
ఓల్డ్ రెజిమ్ |
|
రూ. 4,00,000 లక్షల వరకు |
0% |
రూ. 2,50,000 లక్షల వరకు |
0% |
|
రూ. 4,00,001 నుండి 8,00,000 లక్షల వరకు |
5% |
రూ. 2,50,001 నుండి 5,00,000 లక్షల వరకు |
5% |
|
రూ. 8,00,001 నుండి 12,00,000 లక్షల వరకు |
10% |
రూ. 5,00,001 నుండి 10,00,000 లక్షల వరకు |
20% |
|
రూ. 12,00,001 నుండి 16,00,000 లక్షల వరకు |
15% |
రూ. 10,00,000 లక్షలు పైబడిన |
30% |
|
రూ. 16,00,001 నుండి 20,00,000 లక్షల వరకు |
20% |
(60 సంవత్సరాలు పైబడిన వారికి 3 లక్షల వరకు, 80 సంవత్సరాలు పైబడిన వారికి 5 లక్షల వరకు గల ఆదాయముపై పన్ను మినహాయింపు
కలదు.) |
|
|
రూ. 20,00,001 నుండి 24,00,000 లక్షల వరకు |
25% |
||
|
రూ. 24,00,000 లక్షలు పైబడిన |
30% |
||
|
U/s 16 (i)a కింద
75,000 Standard Deduction కలదు |
U/s 16 (i)a కింద
50,000 Standard Deduction కలదు |
||
|
ఆరోగ్య
మరియు విద్యా సెస్సు
: చెల్లించాల్సిన ఆదాయముపై 4% |
|||
IT FY 2025-26 AY 2026-27 Trail Version 1.0
2025-26 ఆర్థిక సంవత్సరానికి న్యూ
రెజిమ్ లో
ఆదాయపు గణన
విధానము (Income Tax New Regime U/s 115 BAC)
భారత ప్రభుత్వం మొదటగా 2020-21 బడ్జెట్లో ఆదాయపు పన్ను చట్టం, 1961 లో 115 BAC అనే కొత్త సెక్షన్ ను నూతనంగా
పొందుపరచినది. దీనినే న్యూ టాక్స్ రెజిమ్ అంటారు. ఆదాయ గణనలో పాత పద్దతి అలాగే
ఉంచుతూ 2020-21
నుండి ఈ న్యూ రెజిమ్ ను హిందూ అవిభాజ్య కుటుంబాల వ్యక్తుల ఆదాయపన్ను మదింపును
ఐచ్చికంగా ఎంపిక చేసుకునుటకు వీలుగా ఈ నూతన సెక్షన్ వెసులుబాటు కల్పించింది. ఈ
నూతన సెక్షన్ లో ఆదాయపు పన్ను 7 శ్లాబులకు పెంచబడింది. ఈ నూతన సెక్షన్ వలన నికర ఆదాయం
రూ.12.75 లక్షల
లోపు ఉంటె ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 12.75 లక్షల నికర ఆదాయంలో రూ. 75,000 లకు సెక్షన్ 16
(i) a కింద మరియు రూ. 12 లక్షల ఆదాయం పై చెల్లించాల్సిన రూ.
60,000 వరకు
రిబేట్ section 87A
ద్వారా కల్పించబడింది. ఈ న్యూ రెజిమ్ విధానములో 60/80 సంవత్సరాలకు వేరువేరు కాకుండా శ్లాబులు
వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా ఉంటుంది.
ఇందులో పాత రెజిమ్ లో ఉన్న మినహాయింపులు దాదాపు వర్తించవు కొన్ని
మినహాయింపులకు అవకాశం ఉంటుంది అవి. వికలాంగులకు ప్రతి నెల పొందే రూ.3000 కన్వేయన్స్ అలవెన్స్ కు మినహాయింపు
కలదు, CPS ఉద్యోగులకు
ప్రభుత్వం NPS ఖాతాలో
జమచేసే మొత్తానికి పూర్తి మినహాయింపు ఉంది. హోమ్ లోన్ ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చి అందులో నుండి వచ్చే అద్దె మొత్తాన్ని
ఆదాయంగా చూపి కొత్త పన్ను విధానంలో కూడా ఎటువంటి ఎగువ పరిమితి లేకుండా గృహ రుణం వడ్డీని మినహాయింపు గా క్లెయిమ్ చేయవచ్చు. మీరు సొంత ఇంట్లో ఉంటూ దానిపై
గృహరుణం ఉంటే వడ్డీ మినహాయింపును క్లెయిమ్ చేయడాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు కొత్త
పన్ను వ్యవస్థ నుండి స్పష్టంగా వైదొలిగి, పాత పన్ను వ్యవస్థ కింద మీ రిటర్న్ లను దాఖలు
చేయవలసి ఉంటుంది.
గత ఆర్ధిక సంవత్సరం వరకు నిర్ణిత ఆదాయం పైన అనగా పాత పన్ను వ్యవస్థ
(ఓల్డ్ రెజిమ్) లో రూ.5,00,000
వరకు అదేవిధంగా నూతన పన్ను వ్యవస్థ (న్యూ రెజిమ్) లో రూ.7,00,000 వరకు సెక్షన్ 87A ద్వారా వరకు ఇస్తున్న రిబేట్, నిర్ణిత
ఆదాయం పైన ఉండే కొద్దిపాటి ఆదాయం కి కూడా ఎక్కువ మొత్తం లో టాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి
ఉండేది. కానీ ఈ ఆర్ధిక సంవత్సరం నుండి నూతన పన్ను వ్యవస్థ (న్యూ రెజిమ్) లో మార్జినల్
రిలీఫ్ అవకాశం కల్పించారు, దీనితో ఇక రూ.12.75 లక్షల వరకు కొంచెం Marginal
Relief లభిస్తుంది,
దాని కంటే పైగా అయితే సాధారణ slab rates ప్రకారం పన్ను పడుతుంది, దీనిని అర్థం
చేసుకోవడానికి రెండు సందర్భాలను పరిశీలిద్దాం.
ఒక ఉద్యోగి ఆదాయం రూ.12,75,000 అయితే ఈ మొత్తం ఆదాయం నుండి సెక్షన్
16 (i)a కింద
స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 లను తీసివేయగా నికర "పన్ను విధించదగిన ఆదాయం రూ.12,00,000” కాగా ఇట్టి మొత్తం ఆదాయం పైన సెక్షన్
87A ప్రకారం
రూ.60,000 (4,00,000X0% + 4,00,000X5% + 4,00,000X10% =
0+20,000+40,000=60,000)
వరకు పన్ను మినహాయింపు కలదు. ఇంకొక ఉద్యోగి ఆదాయం రూ.12,85,000 అయితే ఈ మొత్తం ఆదాయం నుండి సెక్షన్
16 (i)a కింద
స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000 లను తీసివేయగా నికర "పన్ను విధించదగిన ఆదాయం
రూ.12,10,000”
కాగా ఇట్టి మొత్తం ఆదాయం పైన చెల్లించాల్సిన టాక్స్ రూ. 61,500+4%
ఎడ్యుకేషన్ సెస్సు (4,00,000X0%
+ 4,00,000X5% + 4,00,000X10%10,000X15% = 0+20,000+40,000+1,500=61,500+4%=62,460) కానీ ఈ ఆర్ధిక సంవత్సరం ఇచ్చిన సెక్షన్
87A ప్రకారం రూ.60,000 వరకు
రిబేట్ మాత్రమే కాకుండా మార్జినల్ రిలీఫ్ అవకాశం ఇస్తుంది.
మార్జినల్ రిలీఫ్ లెక్కింపు: రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను
"సున్నా" (రిబేట్ కారణంగా), రూ.12,10,000 ఆదాయంపై పన్ను (రూ.61,500) అనేది రూ.12 లక్షలు దాటిన అదనపు ఆదాయం (రూ.10,000) కంటే ఎక్కువగా ఉంది. మార్జినల్
రిలీఫ్ ఈ అదనపు పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అదనపు పన్ను అదనపు ఆదాయానికి
మించకూడదు. పన్ను (రిలీఫ్ ముందు) - అదనపు ఆదాయం = మార్జినల్ రిలీఫ్ మొత్తం రూ.61,500 - రూ.10,000 = రూ.51,500
చెల్లించవలసిన తుది పన్ను: మొత్తం పన్ను (రిలీఫ్ ముందు) -
మార్జినల్ రిలీఫ్ = తుది పన్ను రూ.61,500 - రూ.51,500 = రూ.10,000 సెస్ (Cess) వర్తింపు: పన్నుపై 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్
వర్తిస్తుంది. సెస్: 4% రూ. 10,000 = రూ.400 మొత్తం చెల్లించవలసిన పన్ను: రూ.10,000 (పన్ను) + రూ.400 (సెస్) = రూ.10,400 కాబట్టి, FY
2025-26 లో రూ.12,10,000 ఆదాయంపై, మీరు కొత్త పన్ను
విధానాన్ని ఎంచుకుంటే, మార్జినల్ రిలీఫ్ తర్వాత చెల్లించవలసిన మొత్తం పన్ను రూ.10,400 (సెస్ కలిపి). రూ.12 లక్షల పైన ఉన్న చిన్న ఆదాయంకు రూ.12,75,000 వరకు మార్జినల్ రిలీఫ్ అవకాశం ఇస్తుంది.
* పాత పన్ను వ్యవస్థ (ఓల్డ్ రెజిమ్) లో మినహాయింపులు ఏంటో ఓసారి చూద్దాం:
ఆదాయముగా
పరిగనించబడే జీతబత్యములు: Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు
ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం,
మొ||నవి ఆదాయంగా పరిగణించబడును. ఆదాయముగా పరిగనించబడని అంశములు: పదవి
విరమణ తరువాత పొందే GPF/GIS/AP (TS) GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు
సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్
మరియు GPF,
(TS) GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.
Section 16: ఆర్థిక సంవత్సరంలో జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి గరిష్టంగా రూ.50,000
వరకు సెక్షన్ 16(ia) ద్వారా మినహాయింపునిచ్చారు. Section 87A: ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము
5లక్షల లోపు ఉన్న వారికి చెల్లించాల్సిన టాక్స్ లో గరిష్టంగా రూ.12,500 వరకు
రిబేట్ సదుపాయాన్ని పెంచారు. ఈ సెక్షన్ ఉపయోగించుకుని 5లక్షల లోపు
ఆదాయం కలిగిన వారు పూర్తి టాక్స్ మినహాయింపు పొందుతారు. *
చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన అదనంగా చెల్లించాల్సిన హెల్త్ & ఎడ్యుకేషన్
సెస్ 4%.
మినహాయింపులు: 1. HRA మినహాయింపు Under Section 10(13A) : మొత్తము ఆదాయం నుండి పొందిన ఇంటి అద్దె
బత్యం మొత్తం మినహాయింపు
పొందవచ్చును. మొత్తం ఇంటి అద్దె గా
చెల్లించిన మొత్తం - 10% వేతనం. ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-
(సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు HRA మినహాయింపు
పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. IT Department circular No. 8/2013
Dt. 10.10.2013 ప్రకారం మీరు చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన
పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న
వారికి HRA మినహాయింపు వర్తించదు.
2. ఇంటి ఋణం పై వడ్డి (Section24):
ఇంటి ఋణంతో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి
ఋణంపై చెల్లిస్తున్న వడ్డిపై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒకవేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా
ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు
పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయికి
ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని
ఆదాయంగా చూపాలి. U/s80EE: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం
పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి రుణం పొంది. ఇంటి విలువ 50లక్షలు లోపు
ఉండాలి, ఋణం 35లక్షల లోపు 01.04.2016 నుండి 31.03.2017 మద్యన తీసుకున్న ఋణం వడ్డీ పై U/s 24: కి అదనంగా 50,000 వేల మినహాయింపు
కలదు. U/s80EEA: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం
పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి రుణం పొంది. స్టాంప్ డ్యూటీ విలువ
45లక్షలు లేదా లోపు ఉండాలి 01.04.2019 నుండి 31.03.2022 మద్యన తీసుకున్న రుణం
వడ్డీ పై Section 24 కి అదనంగా 1,50,000 వేల మినహాయింపు కలదు.
3. ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి
(80E): Self, Spouse,
Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం
పై 2023-24 ఆర్థిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు
ఋణం ముగిసే వరకు లేదా గరిష్టం గా 8 సం. లు వర్తిస్తుంది.
4. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తీ
వికలాంగులయితే (80U): ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80%
కంటే తక్కువ వైకల్యం ఉంటే 75,000/-, 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటే 1,25,000/- మినహాయింపు కలదు.
5. ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD): ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై
ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటే సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా
తక్కువగా వైకల్యం ఉంటే 75,000/-, 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటే 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకొసం
సంబంధిత అధికారులు జారిచేసిన సర్టిఫికెట్ పొంది ఉండాలి.
6.అనారోగ్య చికిత్సకు అయిన ఖర్చు
(80DDB): ఉద్యోగి కాని తనమీద
ఆడరపడిన వారు Cancer, Hemophilia, Thalassemia, Neurological diseases మరియు
Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన
సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 1లక్ష వరకు మినహాయింపు కలదు. ఫారం 10-I లో
సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDOలకు లేదు.
7.చందాలు (80G) : PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గల
వాటికి ఇచ్చే చందాలు మినహా, 80G క్రింద కు
వచ్చే 50% లేదా 30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.
* Note: సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు
చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి,
అధికముగా చేల్లించిన Income Tax Department వారికి ITR ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారు.
8.మెడికల్ ఇన్సూరెన్స్ (80D): ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్
ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం
చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/-, ఉద్యోగికి మరియు పేరెంట్స్ కి మెడికల్
ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం గరిష్టంగా 25,000/-, సీనియర్ సిటిజెన్ అయితే ప్రీమియం గరిష్టంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి మరియు
పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్
కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్
కింద గరిష్టంగా రూ.5,000/- మినహాయింపు కలదు. ఉద్యోగి కుటుంబ సభ్యులకు మరియు పేరెంట్స్ కోసం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1,00,000/-
వరకు మినహాయింపు కలదు.
అంధులు లేదా చెవిటి మరియు మూగ లేదా తక్కువ అంత్య
భాగాల వైకల్యంతో ఆర్థోపెడిక్ వికలాంగ ఉద్యోగులకు తన నివాస స్థలం మరియు అతని విధి
స్థలం మధ్య ప్రయాణించు ప్రయోజనం కోసం అతని ఖర్చులను తీర్చడానికి రవాణా భత్యం గా
మంజూరు చేయబడిన కన్వేయన్సు అలవెన్స్ ను sub-clause (ii) of clause (14) of section
10 ప్రకారం ప్రతినెల గరిష్టంగా 3200/- వరకు మినహాయింపు కలదు. మనం ప్రతినెల చెల్లిస్తున్న వృత్తి
పన్ను (Professional Tax) కి section 16 (iiiB) ప్రకారం పూర్తిగా మినహాయింపు కలదు.
పొదుపు
పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష: వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C): GPF,
ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident
Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువులకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు
చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్థిక
సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5
లక్ష వరకు మినహాయింపు కలదు.
3. CPS deduction (80CCD): కొత్త పెన్షన్ పై నియామకం అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల జీతం నుండి 10%చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు. ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమ చేస్తున్న CPS మ్యాచింగ్ గ్రాంట్ 10% ని 80CCD(2) ప్రకారం జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనంగా మినహాయింపు కలదు. FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది
దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ము పైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది.
ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ
వారు పైన 2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No.
Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80C కింద CPS నిధి కాకుండా 1.50
లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS) నిధి కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త
పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని
80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు. * 80C,
80CCC, 80CCD ల పొదుపుల పైన మొత్తము గా 1.5 లక్షలు తగ్గింపు ఉంటుంది.
సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ (80TTA),
60 సం|| దాటినా సీనియర్ సిటిజన్స్ లకు బ్యాంకు వడ్డీ
మినహాయింపు (80TTB): సేవింగ్స్ ఖాతా లో
జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం మినహాయింపు అవకాశం ఉంది. 60 సంవత్సరంలు దాటినా సీనియర్ సిటిజన్స్ లకు ఖాతా లో జమయిన వడ్డీని 80TTB ప్రకారం గరిష్టం గా 50,000/- వరకు అదనముగా మినహాయింపు అవకాశం
ఉంది. ఇది రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా
మినహాయింపు అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వెహికల్ వడ్డీ మినహాయింపు (80EEB): ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా
ఋణంపొంది ఎలక్ట్రిక్ వెహికల్ వాహనం 01.04.2019 నుండి 31.03.2023 మధ్యలో తీసుకున్న వారికి ఆ ఋణం పై చెల్లించిన
వడ్డీ పై 1,50,000 వరకు మినహాయింపు
కలదు.
*Note: DDO లు జీతం బిల్లు పొందే సమయములో డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది,
దీనికి సంబందించిన బిన్ నెంబర్స్ STO/ Online లో STO ల AIN & DDO ల TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా ఇ- పైల్లింగ్ ద్వారా TDS వివరాలు 31 జూలై, 2026 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax
Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది.
ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు
సమర్పించాలి? : జనవరి మాసములో మీ సేవింగ్స్ మరియు
మినహాయింపులను తెలుపుతూ Form-12BB పూర్తిచేసి DDO లకు ఇవ్వాలి. వాటిని పరిగణలోకి
తీసుకుని, నెలవారీగా చెల్లించిన
జీతం మరియు జీతం ద్వారా చేసుకున్న పొదుపుల ఆధారంగా DDOలు విధిగా తమ పరిధిలోని ఉద్యోగుల
Form-16ని తన పరిధిలోని ఉద్యోగులకు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా ఇవ్వాలి. ITR సమర్పించే సమయంలో 26AS ద్వారా
చూసుకుని ఈ ఆదాయాన్ని Income from other source లో చూపిస్తూ DDO లు చెల్లించిన
టాక్స్ (TDS) సర్టిఫికెట్ Form 16 తో కలిపి సమర్పించాలి.
ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా
పొందాలి. ఉద్యోగులు "ITR" ఫారములలో రిటర్న్ లను Income Tax Department
వారికి సమర్పించాలి.
IT FY 2025-26 AY 2026-27 Trail Version 1.0
0 comments:
Post a Comment