Old Useful G.Os

Notifications

Results

Thursday 28 January 2016

Salaried IT AY 2016-17 Section wise Information in Telugu

2015 - 16 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన 

ఆదాయపు పన్ను శ్లాబులు 2015-16 ఆర్థిక సంవత్సరానికి 2014-15 ఆర్థిక సంవత్సరం లాగే కొనసాగించారు ఎలాంటి పెంపును ప్రతిపాదించలేరు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరం  గణన లో తేది 01.04.2015 నుండి 31.03.2016 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.



Category

Slab

Tax

 Age below 60 Years
Upto 2,50,000
Nil
2,50,001-5,00,000
10% of amount by which the taxable income exceeds Rs. 2,50,000/-.
5,00,001-10,00,000
Rs. 25,000/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 125,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

 Age 60Yrs and above -  below 80Yrs  (Senior Citizens)
Upto 3,00,000
Nil
3,00,001-5,00,000
10% of amount by which the taxable income exceeds Rs. 3,00,000/-.
5,00,001-10,00,000
Rs. 20,000/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 120,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

Age 80Yrs and above                                 (Super Senior Citizens)
Upto 5,00,000
Nil
5,00,001-10,00,000
20% of amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 100,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

 Senior Citizen (Individual who is of the age of 60 years or more but below the age of 80 years at any time during the previous year i.e. born on or after 1st April 1936 but before 1st April 1956)


Super Senior Citizen(Individual who is of the age of 80 years or more at any time during the previous year i.e. born on or before 1st April 1936 )


Section 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 2,000/- రిబేట్ కలదు.
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:- 

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు :- 

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

HRA మినహాయింపు : 

 Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును. 
  1. పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం 
  2. ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ 
  3. 40% వేతనం 
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. 


మినహాయింపులు : 

  1. ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ  ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.  

  2. ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) : Self, Spouse, Children ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై 2015-16  ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 7 సం. లు వర్తిస్తుంది.

  3. ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD) :   ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి. 

  4. ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) : ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. 

  5. అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) :  ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 60,000/- ,80 లేదా 80సంవత్సరాలు పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

  6.  చందాలు (80G) : PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

* Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2016 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు. 

మెడికల్ ఇన్సురెన్స్ (80D) :  ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. 

ఉద్యోగి  సిటిజెన్ పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు
  • కన్వేయన్స్ అలవెన్స్ కి  మినహాయింపు కలదు. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు కలదు. 

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :  

  1. వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ  రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 

  2. Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC) :   LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 

  3. CPS deduction (80CCD) :  కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం 1లక్ష వరకు మినహాయింపు కలదు . ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం  జమయిన మొత్తాన్ని రూ. 1.5 లక్షలకు అఅదనం గా మినహాయింపు కలదు. 80CCD(1B) తో 50,000/- అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వస్తుంది.  * 80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది. 

అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG) :  Rajiv Gandhi Equity Saving Scheme ద్వారా 1.5 లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు. 

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :   సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  

* Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2016 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. 

ఆదాయపు పన్నుకు సంబందించి ఏయే ఫారములు సమర్పించాలి? 

జనవరి,  ఫిబ్రవరి మాసములలో కాలికులేషన్ షీట్ తో  సహా Form-16 పూర్తిచేసి DDOలకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5లక్షల కంటె ఎక్కువ  ఉన్నవారు, బ్యాంక్, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కల ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందువారు "SAHAJ" ఫారములలో రిటర్న్ లను 31జూలై , 2016 లోపు Income Tax Department వారికి సమర్పించాలి. 
  

ఆదాయపు పన్నును ఎట్లా చెల్లించవచ్చు?   


ఆదాయపు పన్నును శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసుకున్నాచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతినెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించుకోన్నచో పిబ్రవరి మాసంలలో అధిక భారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి.  పిబ్రవరి  నెలలో ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసుకుని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2016 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యుల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి. 

ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించుట ప్రతి పౌరుని సామాజిక, రాజ్యాంగ భాద్యత, ఉపాద్యాయులు ఈ భాద్యతను సక్రమంగా నెరవేర్చి ఉద్యోగ వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము.    

IT Department Circular for Salaried - FY 2015 - 16 - AY 2016-17 - Download

IT FY 2015-16 Full Version Click here

0 comments:

Post a Comment